గర్భిణీలూ.. నెలలు నిండకుండానే బర్త్ వెయిటింగ్ హాల్‌కు రండి: మంత్రి రజిని

4 Oct, 2023 20:05 IST|Sakshi

సాక్షి, అల్లూరి జిల్లా: మన్యానికి జ్వరం వచ్చింది అన్న శీర్షికలతో గతంలో వార్తలు చదివాం.. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది మన్యానికి మంచి ఆరోగ్యం వచ్చింది. సీఎం జగన్‌ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఇది ఓ చరిత్ర.. అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. 

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కిల్లోగూడ గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సందర్శించారు. అక్కడ వచ్చినా రోగులతో మాట్లాడారు. వివిధ దశల్లో జగనన్న  ఆరోగ్య సురక్ష అమలు తీరును ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

అంతకుముందు ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల మంచి మనసు తనకు ఎంతో మనసుకు నచ్చిందన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలని సీఎం జగన్‌ ఆలోచన మేరకు కృషి చేస్తున్నట్టు వివరించారు. గర్భిణీలు నెలలు నిండే వరకు గిరిజన గ్రామాల్లో ఉండకుండా బర్త్ వెయిటింగ్ హాళ్లకి చేరాలని కోరారు గర్భిణీ తో వచ్చే సహాయకులకు ఉచితంగా వసతి ఆహారం అందిస్తామని చెప్పారు. దీనిద్వారా ప్రసాద్ సమయంలో ఇబ్బందులు పడకుండా దోళీమోతలు లేకుండా ఉంటాయని వివరించారు. ఈ విషయంలో గర్భిణీలకు ఆశా వర్కర్లు సహకరించాలని సూచించారు.

ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రెండు రోజుల్లోనే గరిష్టంగా 11 వేల 550  మందికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ ఆసుపత్రులకు సిఫార్సు చేశామన్నారు. సాధారణ జ్వరం లాంటి రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య సదుపాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష నగరాలు గ్రామీణ ప్రాంతాల కంటే మారుమూల గిరిజన గ్రామాలకు చెరువు చేయాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు.

గతం మాదిరిగా పాడేరు అరకు మన్యం ప్రాంతాల నుంచి వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే అధునాతన వైద్యం అందే రీతిన చర్యలు చేపట్టారని, వచ్చే ఏడాదికి పాడేరు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. వచ్చే ఏడాది నుంచి 300 పడకల ఆసుపత్రి కూడా అందుబాటులోకి వస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు.

గతంలో చూస్తే మన్యంలో ఖనిజ సంపదను దోచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని.. ఇప్పుడు అందుకు భిన్నంగా గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్‌ ఆలోచనలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతానికి దగ్గరగా ఉన్న గర్భిణీలు కోసం ఆసుపత్రులకు దగ్గరలో బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గిరిజన ప్రజల కోసం పాడేరు పార్వతిపురం మన్యం జిల్లాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఇక జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి వచ్చే గిరిజనులకు మధ్యాహ్నం ఆహారం కూడా ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపించాలని ఆమె కోరారు. తొలిసారిగా గర్భిణీ స్త్రీల వెయిటింగ్ హాల్ కోసం తన క్వార్టర్స్ ను కేటాయించిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ను ఆమె అభినందించారు. మరింత మెరుగైన వైద్యం గిరిజన ప్రజలకు అందించడానికి అవసరమైన కొత్త ప్రణాళికలను అమలు చేస్తామని మంత్రి విడుదల రజిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ..పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మీ.. జగన్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర.. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు