చీఫ్‌ విప్‌ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం 

12 Apr, 2022 12:39 IST|Sakshi
ముదునూరు ప్రసాదరాజును సత్కరిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి

దెందులూరు(పశ్చిమగోదావరి): ఆంధ్రప్రదేశ్‌ నూతన చీఫ్‌విప్‌గా ముదునూరి ప్రసాదరాజును ఎంపిక చేయడం వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏపీ చీఫ్‌విప్‌ చాంబర్‌లో ప్రసాదరాజును కలిశారు. శాలువా, బొకేతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు, దెందులూరు మండల పార్టీ కన్వీనర్‌ కామిరెడ్డి నాని, పోతునూరు మాజీ సొసైటీ చైర్మన్‌ గూడపాటి పవన్‌కుమార్‌ ఉన్నారు.
చదవండి: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు