Decentralization: స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ

8 Oct, 2022 11:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈక్రమంలోనే విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్‌లో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్‌ లజపతిరాయ్‌కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్‌ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్‌ విసిరారు. 

ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. 

చదవండి: (Visakhapatnam: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: అవంతి శ్రీనివాస్‌)

మరిన్ని వార్తలు