వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్‌

14 Aug, 2022 13:36 IST|Sakshi

సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ నేతలు కుట్రపూరితంగా తనపై ఫేక్‌ వీడియోలు సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఐటీడీపీ సోషల్‌ మీడియా ద్వారా యూకే నుంచి ఫేక్‌ వీడియోలను పంపారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ, పచ్చ మీడియా కలిసి ఈ వీడియోలను ప్రసారం చేశారు. రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్‌ నాయుడు.. చంద్రబాబుతో చేతులు కలిపారు. వీరంతా కలిసి బడుగు, బలహీన వర్గాలను అణచివేస్తున్నారు. మంచి, చెడులు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని పచ్చ ఛానళ్లు చూస్తున్నాయి' అంటూ గోరంట్ల మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: (ఆ వీడియో ఒరిజినల్‌ కాదు)

మరిన్ని వార్తలు