గూగుల్‌కు నర్సీపట్నం యువకుడి ఎంపిక.. భారీ వేతనం.. ఎంతో తెలుసా?

4 Feb, 2022 12:33 IST|Sakshi
తల్లిదండ్రులతో విష్ణు యాష్‌

విశాఖపట్నం: స్థానిక వెలమ వీధికి చెందిన జయంతి విష్ణు యాష్‌ భారీ వేతనంతో సాఫ్ట్‌వేర్‌ కొలువుకు ఎంపికయ్యాడు. విష్ణు హిమచల్‌ప్రదేశ్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ పూర్తి చేసిన అనంతరం యాక్సించర్‌ కంపెనీకి రూ.8.50 లక్షల వేతనంతో ఎంపికయ్యాడు.  

తాజాగా బెంగళూరులో ఉన్న  గూగుల్‌ సంస్థ రూ.47.50 లక్షలు వార్షిక వేతనంతో  విష్ణును ఎంపిక చేసింది. విష్ణు తండ్రి సత్యనారాయణమూర్తి రిటైర్డ్‌ వార్డెన్, తల్లి వేదవల్లి గృహిణి, కుమారుడు గూగుల్‌ సంస్థకు ఎంపిక కావటం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు