నిట్‌ డైరెక్టర్‌ సీఎస్‌పీ రావు తొలగింపు

25 Sep, 2022 13:43 IST|Sakshi

తాడేపల్లిగూడెం: ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థ ఏపీ నిట్‌ డైరెక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న సస్పెండైన నిట్‌ డైరెక్టర్‌ సీఎస్‌పీ రావును టెర్మినేట్‌ చేసింది. కాగా, వరంగల్‌ నిట్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌పీ రావు ఏపీ నిట్‌కు డైరెక్టర్‌గా 2018 మార్చి 19న బాధ్యతలు తీసుకున్నారు. ఐదేళ్ల పదవీ కాలం లేదా 70 ఏళ్ల వయస్సు.. ఏది ముందైతే అప్పుడు డైరెక్టర్‌ పదవి నుంచి తొలగిపోవచ్చు. ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా, ఇంకా వయస్సు ఉంటే మరోసారి డైరెక్టర్‌గా అవకాశం తెచ్చుకోవచ్చు. నిట్‌ తాత్కాలిక ప్రాంగణం నుంచి సొంత భవనానికి వచ్చే సరికి సీఎస్‌పీ రావుపై అభియోగాలు మొదలయ్యాయి. రావుకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

నిట్‌ రెండు, మూడో స్నాతకోత్సవాలు జరిగాక రావు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్‌పర్సన్, రాష్ట్రపతి భవన్, కేంద్ర ఉన్నత విద్యా శాఖ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి, ఈ ఏడాది మార్చిలో 60వ పుట్టిన రోజు వేడుకలను సీఎస్‌పీ రావు అట్టహాసంగా జరుపుకొన్నారు. ఆ మరునాడే సీబీఐ కేసులు నమోదు కావడం, సీఎస్‌పీ రావు సస్పెండ్‌ కావడం జరిగింది. జూన్‌ 27న సస్పెన్షన్‌ను మరో 90 రోజులు పొడిగించారు. ఇదే సమయంలో సీఎస్‌పీ రావుపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలపై విచారణకు రాష్ట్రపతి కార్యాలయం అనుమతితో జూన్‌ 27న వన్‌మ్యాన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ కమిటీ లోతుగా దర్యాప్తు జరిపింది. పూర్తి ఆధారాలను సేకరించింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఉన్నత విద్యా సంస్ధగా ఉన్న ఏపీ నిట్‌ డైరెక్టర్‌ స్థాయి వ్యక్తిగా రావు వ్యవహరించలేదని కమిటీ నివేదికను ఇచి్చంది. డైరెక్టర్‌ పదవికి అనర్హుడిగా తేలి్చంది. ఈ నివేదిక ఆధారంగా సెంట్రల్‌ సివిల్‌ సరీ్వస్‌ రూల్సును అనుసరించి సీఎస్‌పీ రావును డైరెక్టర్‌ పదవి నుంచి తొలగిస్తూ కేంద్ర ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచి్చంది. దీని ప్రకారం మాతృ సంస్థ వరంగల్‌ నిట్‌కు సీఎస్‌పీ రావు రిపోర్టు చేయాలి. అభియోగాలపై క్రమశిక్షణ చర్యలు అక్కడ తీసుకోవాలనేది ఉత్తర్వుల్లో ఉన్న సారాంశం.
 

మరిన్ని వార్తలు