పంటల రవాణాపై ఆంక్షలు లేవు: పూనం మాలకొండయ్య

26 Jun, 2021 16:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటల రవాణాపై ఆంక్షలు లేవని అగ్రికల్చర్‌ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మామిడి పండ్ల కోసం 27 కిసాన్‌ రైళ్లను ఏర్పాటు చేశామని.. మామిడి ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

గత ఐదు వారాల నుంచి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మిర్చి, పసుపు, అరటి, ఆరెంజ్‌ పంటలకు మద్దతు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 25చోట్ల పండ్ల ప్రాసెసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జులై 8న 2 వేల గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని పూనం మాలకొండయ్య వెల్లడించారు.

చదవండి: గోదావరి జిల్లాల్లో సాగునీటి కష్టాలకు ఇక చెల్లుచీటీ!
గ్రానైట్‌ అక్రమార్కులపై విజిలెన్స్‌ పంజా

>
మరిన్ని వార్తలు