దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు

17 Oct, 2020 05:21 IST|Sakshi
దివ్య తేజశ్విని కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న కృతిక శుక్లా, దీపికా పాటిల్‌

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో బాధిత కుటుంబాన్ని కలిసిన అధికారులు 

మహిళలపై ఉన్మాద చర్యలను ఉపేక్షించబోం 

ప్రత్యేక అధికారులు కృతిక శుక్లా, దీపికా పాటిల్‌ స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేస్తారని దిశ ప్రత్యేక అధికారులు కృతిక శుక్లా, దీపికా పాటిల్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వారు విజయవాడలోని దివ్య తేజశ్విని కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 

► సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాం.  
► మహిళలపై ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. 
► ఈ కేసులో నిందితుడిపైన దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జ్‌ షీట్‌ దాఖలు చేస్తాం. 
► ఆపదలో ఉన్న మహిళలు డయల్‌ 100, డయల్‌ 112, డయల్‌ 181 ద్వారా పోలీసుల సహాయం కోరాలి. దిశ యాప్, పోలీస్‌ సేవ యాప్‌ అందుబాటులో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు