ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా?: లోకేష్‌పై వర్మ సెటైర్లు

29 Oct, 2023 20:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేష్‌పై సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సెటైర్లు వేశారు. సమాజానికి వర్మ ఏం చేశాడు, ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఏం చేశాడంటూ లోకేష్‌ చేసిన ట్వీట్లకు దర్శకుడు వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. లోకేష్‌ను చూసి జాలిపడలా, నవ్వాలా, ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు.

తానొక ఫిలిం మేకర్‌నని, సినిమాలు తీయడం తన పని అని పేర్కొన్నారు. తాను లోకేష్‌లా జనాలకు సేవ చేయడానికి పుట్టాను, తిరుగుతున్నాను, చస్తాను అని ఎప్పుడైనా చెప్పానా అని ప్రశ్నించారు. తనను విమర్శించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయాలని తప్పితే మరే అంశం దొరకలేదా అని మండిపడ్డారు.
చదవండి: విజయనగరం: కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం, ఒకరు మృతి

‘అదే నేను నీ  స్థానంలో ఉంటే ఏ చేస్తానో తెలుసా.. అతడను హిట్‌  ఇచ్చి చాలా రోజులు అయ్యింది. పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు. అడ్డదిడ్డమైన ట్వీట్లు పెడతాడు. అలాంటి వ్యక్తికి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని చెప్పవచ్చు. భాద్యతలేని, నైతికత లేని వ్యక్తి అని చెప్పవచ్చు. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా. నా లైఫ్ ఓపెన్ బుక్. నేనెపన్పుడూ నీలాగా ఎక్కడో స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో ఉన్న ఫోటోలను దాచేసి అలాంటివి నేనెప్పుడూ చెప్పను. ఇంత చిన్న విషయం కూడా నీకు తెలియకపోవడం ఆశ్యర్యంగా ఉంది.

ఒకవేళ చంద్రబాబు  ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఇన్ స్టబిలైజ్ అయ్యిందేమో.. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదేమో. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. నాలాంటి వ్యక్తిని ఎలా విమర్శించాలో సబ్జెక్ట్‌ తెలియకుంటే మాట్లాడితే.. మీ తండ్రిని దేవుడు కూడా కాపాడు లేడు. నిన్ను చూస్తే నాకు బాధ కలుగుతుంది. లండన్ కో ఎక్కడికో వెళ్లి రెస్ట్ తీసుకొని మనసుకు శాంతపరుచుకుంటే మంచిది నువ్వు. ఊరికనే హైరానా పడి ఏది పడితే అది మాట్లాడితే రాంగ్ సిగ్నల్ వెళుతుంది నీ మంచి కోసం నేను చెప్తున్నా’ అంటూ ట్విటర్‌లో వీడియో పోస్టు చేశారు.

మరిన్ని వార్తలు