ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త కోర్సుల కోసం వినతి

7 Feb, 2023 09:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రైవేట్‌ అటానమస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల సమస్యలు పరిష్కారమయ్యేలా ఉన్నత విద్యామండలి తోడ్పాటు అందించాలని ఆ కాలేజీల కన్సార్టియం విన్నవించింది. యూజీసీ నుంచి వచ్చిన అటానసమ్‌ స్టాటస్‌ క్రియాశీలకంగా ఉన్నంత కాలం యూనివర్సిటీలు శాశ్వత గుర్తింపు ఇచ్చేలా చూడాలని కోరింది. విజయవాడలో సోమవారం కాకినాడ, అనంతపురం జేఎన్‌టీయూల పరిధిలోని ప్రైవేట్‌ అటానమస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రతినిధులతో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి సమావేశమయ్యారు.

కాలేజీల కన్సార్టియం అధ్యక్షుడు చొప్పా గంగిరెడ్డి, కార్యదర్శులు జీవీఎం మోహన్‌కుమార్, మిట్టపల్లి వి.కోటేశ్వరరావు, ఎన్‌.సతీష్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శాశ్వత గుర్తింపుతోపాటు యూజీసీ నిబంధనలను అనుసరించి యూనివర్సిటీలు అకడమిక్‌ స్వయం ప్రతిపత్తి ఇచ్చేలా చూడాలన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం 2035 నాటికి జీఈఆర్‌ను 50 శాతం మేర సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నందున ప్రస్తుత అటానమస్‌ కాలేజీలను యూజీసీ, రాష్ట్ర యూనివర్సిటీ చట్టాల నిబంధనల మేరకు ప్రైవేట్‌ యూనివర్సిటీలుగా మారేందుకు ప్రభుత్వానికి నివేదించాలన్నారు.

అటానమస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అభివృద్ధి చెందుతున్న అంశాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశమివ్వాలని కోరారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్, డిజైనింగ్, వర్చువల్‌ రియాలిటీలతో నాన్‌టెక్నికల్‌ యూజీ, పీజీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

(చదవండి:

మరిన్ని వార్తలు