వైఎస్సార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

23 Sep, 2020 18:54 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. వీరపునాయునిపల్లె మండలం సంగాలపల్లె- గంగిరెడ్డిపల్లె రహదారి మధ్యలో కారు ఆటో పరస్పరం ఢీ కొనడంతో నీలం లక్ష్మీనరసయ్య (40) మృతి చెందాడు. ఈ ప్రమాదంలో  ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురయిన నీలం లక్ష్మీనరసయ్యను వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడు విఎన్ పల్లి మండలం ఓబుల్‌రెడ్డి పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా