ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణం.. కారణం ఇదే..!

17 Nov, 2023 10:59 IST|Sakshi

గద్వాల క్రైం: కుటుంబ సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని న్యూ హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న విజయ్‌మోహన్‌రెడ్డి(53) మోమిన్‌మొహల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

కొంతకాలంగా ఇంట్లో సమస్యలు తీవ్రం కావడంతో బుధవారం ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి మండలంలోని పూడురూ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానిక రైతులు గమనించి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఆనంద్‌ చేరుకుని పరిశీలించగా మృతుడి గుర్తింపుకార్డు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మృతుడికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య కొన్నేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. రెండో భార్య స్వాతికి 6ఏళ్ల కూతురు ఉంది. కుమారుడు హేమంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి 
మరికల్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయలైన ఘటన గురువారం ఎలిగండ్ల వంతెన వంద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మండలం గున్ముక్లకు చెందిన మంగలి శివశంకర్‌(42) మరికల్‌లో ఓ హేర్‌కంటింగ్‌ షాప్‌లో పని చేస్తున్నాడు. పనులు ముగించుకుఇన సాయంత్రం 7 గంటలకు గున్ముక్లకు స్కూటీపై తిరుగు ప్రయాణం అవుతుండగా మరికల్‌ చౌరస్తాలో ఎమ్మోనోనిపల్లికి చెందిన నవీన్‌ లిప్ట్‌ అడిగి స్కూటీ ఎక్కాడు.

ఎలిగండ్ల స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి వంతెన మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ స్కూటీని ఢీకొనడంతో శివశంకర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. నవీన్‌కు తీవ్రగాయలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు