బిగ్‌బాస్‌: జైలుకు వెళ్ల‌నున్న నోయ‌ల్!

23 Sep, 2020 18:40 IST|Sakshi

సేఫ్ గేమ్ ఆడుతున్న ఇంటి స‌భ్యుల ఆట క‌ట్టించేందుకు నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో వారి మ‌ధ్య అగ్గి రాజేశాడు బిగ్‌బాస్‌. దీంతో అప్ప‌టివ‌ర‌కు డ‌ల్‌గా సాగిన ఆట కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇక త‌ర్వాత‌ది.. ఫిజిక‌ల్ టాస్క్‌.. అస‌లే వేడి మీదున్న కంటెస్టెంట్ల‌కు వారేంటో చూపించుకునేందుకు దొరికిన‌ స‌రైన అవ‌కాశ‌మిది. దీన్ని చేజార్చుకోనివ్వ‌కుండా ఉండేందుకు ప‌క్కోడిని ప‌డగొట్టైనా స‌రే గెల‌వాల‌నుకుంటున్నారు. బిగ్‌బాస్ కూడా ప‌క్కా ప్లాన్‌తోనే కంటెస్టెంట్ల‌ను మ‌నుషులు, రోబోల టీమ్‌లుగా విడ‌గొట్టారు. అయితే మ‌నుషులు టీమ్‌లో బ‌ల‌మైన కంటెస్టెంట్లు ఉన్నార‌ని, వీరిని ఆప‌డం మ‌న త‌రం కాదంటూ రోబోల టీమ్‌లోని అభి ముందే చేతులెత్తేశాడు. దీంతో సోష‌ల్ మీడియాలో అభిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. (చ‌ద‌వండి: డ‌బుల్ ఎలిమినేష‌న్; క‌ళ్యాణి అవుట్‌!)

అభి ప్లాన్‌తో గెలుపు దిశ‌గా రోబోలు
'అతనికి ఎలాగో ఆడ‌టం చేత‌కాదు, క‌నీసం ప‌క్క‌న‌వాళ్ల‌ని కూడా ఆడ‌నివ్వ‌డు' అని సెటైర్లు విసిరారు. కానీ అనూహ్యంగా నేడు రిలీజ్ చేసిన ప్రోమోలో అభి మైండ్‌గేమ్ ఆడాడు. దివిని ప‌క్కా ప్లాన్‌తో కిడ్నాప్ చేశారు. ఇది త‌ట్టుకోలేక‌పోయిన మనుషుల టీమ్ ఆవేశంతో ఊగిపోయారు. అయితే దెబ్బ‌కు దెబ్బ కొట్టేందుకు మ‌నుషుల టీమ్ సిద్ధ‌మైంది. రోబోల దూకుడుకు బ్రేక్ వేయ‌నుంది. వీరు ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంటార‌నేది నేటి ఎపిసోడ్‌లో చూడాలి. మ‌రోవైపు ఈ టాస్క్‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. నిన్న సోమ‌రిపోతుగా ఆటాడ‌కుండా ప్ర‌వ‌ర్తించిన‌ అభిని తిట్టిన‌వారే నేడు అత‌డి ప్లాన్‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. (చ‌ద‌వండి: అతి త్వ‌ర‌లోనే మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ)

కుమార్ సాయిని గ‌డ్డిపోచ‌లా తీసేస్తున్నారు
అత‌డి ప్లాన్‌పై మ‌నుషుల టీమ్ ఎందుకంత మండిప‌డుతుంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. అటు మెహ‌బూబ్‌, సోహైల్ విప‌రీత ప్ర‌వ‌ర్త‌న‌ను క‌డిగి పారేస్తున్నారు. కుమార్ సాయిని గ‌డ్డిపోచ‌లా చూస్తున్నార‌ని అత‌డిపై జాలి చూపిస్తున్నారు. సుజాత ఏడుపు పైనా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చివ‌రికి రోబోల టీమ్ గెలుస్తుంద‌ని, నోయ‌ల్ జైలుకు వెళ్తాడ‌ని మ‌రికొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. ఇవ‌న్నీ ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: గెలవడం‌ కోసం ఆమె ఏమైనా చేస్తుంది!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా