కరోనాతో అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల సాయం

3 Jun, 2021 11:14 IST|Sakshi
చిన్నారులకు పత్రాలను అందిస్తున్న అధికారులు, పార్టీ నాయకులు  

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): కరోనాతో తల్లి చనిపోవడంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం పత్రాలను బుధవారం అధికారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అందజేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలుకు చెందిన నాగేశ్వరమ్మ ఇటీవల కోవిడ్‌తో మృతిచెందారు. మూడేళ్ల కిందటే నాగేశ్వరమ్మ భర్త రమేష్‌ గుండెపోటుతో మరణించాడు. దీంతో వీరి ఇద్దరు పిల్లలు సాయిగణేష్, నాగరవళి అనాథలయ్యారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికారులతో మాట్లాడి చిన్నారులకు ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు. కరోనా అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు రూ.10 లక్షల సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు 
‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. 

 

మరిన్ని వార్తలు