‘అన్ని ప్రాంతాలు బాగుండాలి.. అందులో అమరావతి ఒక భాగంగా ఉండాలి’

3 Oct, 2022 19:51 IST|Sakshi

తాడేపల్లి : రాజధానిగా అమరావతే ఉండాలంటూ చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్‌సీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు సజ్జల. దీనికి ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు హాజరయ్యారు.

దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ..  ‘మన రాజకీయ లక్ష్యం అధికార వికేంద్రీకరణ.  రాష్ట్ర సమగ్రాభివృధ్దికి అదే ఏకైక మంత్రం.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బాగుండాలి.. అందులో అమరావతి ఒక భాగంగా ఉండాలి. ఇదే నినాదంగా ప్రజలలోకి వెళ్లాలి. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకుండా ఉండేందుకే 3 రాజధానులు. రాజధానిగా అమరావతే ఉండాలంటూ చంద్రబాబు, అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.  వికేంద్రీకరణపై ప్రజావేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు జరుగుతున్నాయి. మొన్న కాకినాడ, ఈరోజు రాజమండ్రిలలో జరిగాయి. 3 రాజధానులకు ప్రజల మద్దతు ఉంది’ అని పార్టీ నేతలకు సూచించారు.

మరిన్ని వార్తలు