సర్పంచ్‌గా‌ గెలిచి.. ఎమ్మెల్యేగా ఎదిగి

29 Jan, 2021 11:16 IST|Sakshi

బి.కొత్తకోట:  తంబళ్లపల్లె నియోజకవర్గంలో సర్పంచులుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ముగ్గురు నేతలు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. అందులో ఒకరు టీఎస్‌ శ్రీనివాసులురెడ్డి. ఆయన 1963కు ముందు సర్పంచ్‌గా పనిచేశారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఎనీ్టఆర్‌ ప్రభంజనంలో తంబళ్లపల్లె నుంచి స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించి రికార్డు సృష్టించారు.  టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించి 24,179 ఓట్లు సాధించారు. అలాగే బి.కొత్తకోట మండలం గట్టుకు చెందిన ఎ.నరసింగరావు 1950వ దశాబ్దంలో రెండుసార్లు సర్పంచుగా పనిచేశారు. తర్వాత 1962, 1967లో రెండుసార్లు మదనపల్లె ఎమ్మెల్యేగా గెలుపొందారు. తంబళ్లపల్లె మండలం రేణిమాకులపల్లెకు చెందిన ఆవుల మోహన్‌రెడ్డి 1972లో సర్పంచుగా విశేష సేవలందించారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఇందిరా కాంగ్రెస్‌ అభ్యరి్థగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత 1989లో మదనపల్లె కాంగ్రెస్‌ అభ్యరి్థగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.   

మరిన్ని వార్తలు