ఢీ అంటే ఢీ:  ఆకట్టుకున్న పొట్టేళ్ల పోటీలు

15 Apr, 2021 10:47 IST|Sakshi

సాక్షి, పగిడ్యాల: ఉగాది పండుగను పురస్కరించుకుని పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన పొట్టేళ్ల పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఫైనల్‌లో దామగట్ల జాకీర్‌ పొట్టేలు, పడమర ప్రాతకోట కాశీశ్వర యూత్‌ పొట్టేలు తలపడగా.. దామగట్ల పొట్టేలు విజేతగా నిలిచింది. దీని యాజమానితో పాటు వరుసగా ఐదు స్థానాల్లో నిలిచిన పొట్టేళ్ల యజమానులకు నందికొట్కూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తువ్వా శివరామకృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌నాయుడు వెండి మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు.
చదవండి:
విషాదం: మూడేళ్లకే ముగిసిన కథ!    
ప్రేమను గెలిపించిన పిడకల సమరం

            

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు