ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

7 Sep, 2023 14:16 IST|Sakshi

సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు.. శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. భూమన కరుణాకర రెడ్డికి అర్చకులు సంప్రదాయంగా తలపాగా చుట్టారు. గోపూజ, గోప్రదర్శనం చేసుకున్న తర్వాత పాలుపితికి, గోవులకు  దాణా అందించారు టీటీడీ చైనర్మన్‌. అనంతరం శ్రీ వేంకటేశ్వర దివ్య మహావృత స్థూపం వద్ద నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

టీటీడీ తరఫున చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రజలందరికీ గోకులాష్టమి శుభాభినందనలు తెలియశారు. పరమ పూజ్యమైన పండగ  గోకులాష్టమి రోజున టీటీడీ గో సంరక్షణ శాలలో గోకులాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని తెలిపారు. గోకులాష్టమి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోందన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సాహ్నివాల్ జాతి గోవును టీటీడీ పెద్ద ఎత్తున  ప్రోత్సహిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల ముందే 40 కోట్ల రూపాయల గ్రాంట్‌ను గోశాలకు మంజూరు చేయడం సంతోషకరమన్నారు.
చదవండి: తిరుమల ఆలయంపై విమాన సంచారం.. టీటీడీ సీరియస్‌

సనాతన భారతదేశంలో గాటికి ఆవు లేని ఇల్లు లేనేలేదు. అంతటి పరమ పవిత్రంగా కొలిచే హిందువులకు గోకులాష్టమి అత్యంత ముఖ్యమైనది. గోవులను  పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నేను గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు వందేగోమాతరం పేరిట జాతీయ స్థాయిలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది. దానికి ఇద్దరు నోబుల్ లారెన్స్‌ కూడా రావడం జరిగింది.

గోవులను రక్షించుకోవాలని, గోవులు ఉత్పత్తి చేసేపదార్థాల ద్వారా మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపతాయని వంటి అనేక రకాలుగా సెమినార్‌  అభిప్రాయాలు, సూచానలు వెల్లువెత్తాయి. రెండు రోజుల పాటు జరిగిన సెమినార్‌లో మేధావులంతా పెద్ద ఎత్తున చర్చించిన కారణంగా మంచి అవుట్ పుట్ వచ్చింది. ఆ తరహా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తాం. గోవు మనదరికీ పూజ్యనీయమైన తల్లి లాంటిది.’ అని భూమన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు