9 మంది అప్పన్న వైదికులకు షోకాజ్‌ నోటీసులు

3 Jul, 2021 10:14 IST|Sakshi

సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గడిచి జ్యేష్ట ఏకాదిశి రోజున జరిగిన లక్ష్మీనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవంలో అర్చకులు ఆలపించిన గరుడ గజ్జన పాటను మార్ఫింగ్‌ చేసిన ఘటనలో తొమ్మిది మంది వైదికులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తానే మార్ఫింగ్‌ చేసి ఇన్‌చార్జి ప్రధానార్చకుడికి పంపినట్టు ఇప్పటికే ఓ వేదపండితుడు అధికారుల వద్ద ఒప్పుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. మొత్తం సంఘటనపై ఈవో కొద్ది రోజులుగా విచారణ చేస్తున్నారు.

ఈసంఘటనలో మొత్తం తొమ్మిది మంది వైదికులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అందరినుంచి సమాధానం వచ్చినవెంటనే ఈవో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వైదికుల సమాధానం ఆధారంగా విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై సింహాలచలం దర్శనాలపై కఠిన నిబంధనలు అమలవుతాయని, ఉద్యోగులైనా సరే దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని ఈవో సూర్యకళ తెలిపారు.

మరిన్ని వార్తలు