సీఎం వైఎస్‌ జగన్‌తో తమిళ ఎంపీల భేటీ

12 Oct, 2021 03:38 IST|Sakshi
‘నీట్‌’పై తమిళనాడు సీఎం రాసిన లేఖను సీఎం జగన్‌కు అందిస్తున్న డీఎంకే ఎంపీలు

సాక్షి, అమరావతి: తమిళనాడు ఎంపీలు సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం నిర్వహిస్తున్న ‘నీట్‌’ను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ రాసిన లేఖను సీఎం జగన్‌కు ఎంపీలు అందించారు. సీఎంను కలిసిన వారిలో చెన్నై ఉత్తరం ఎంపీ డాక్టర్‌ కళానిధి వీరాస్వామి, రాజ్యసభ ఎంపీ ఇళంగోవన్‌ ఉన్నారు.

‘నీట్‌’ అడ్మిషన్‌ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల హక్కులను హరిస్తోందని స్టాలిన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వైద్య కళాశాలల ప్రవేశాల్లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీనికోసమే భాజపాయేతర రాష్ట్రాల సీఎంలకు తమ నాయకుడు స్టాలిన్‌ లేఖ రాసినట్లు తమిళనాడు ఎంపీలు.. సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.   

మరిన్ని వార్తలు