ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

15 Sep, 2022 15:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు.  స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను అసెం‍బ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేశారు.

అంతకుముందు స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టీడీపీ సభ్యులు ఏకవచనంతో సంబోధించగా.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వికేంద్రీకరణపై స్పల్ప కాలిక చర్చ

మరిన్ని వార్తలు