కార్యకర్తతో బూట్లు తొడిగించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ

23 Jun, 2022 19:01 IST|Sakshi
కార్యకర్తతో బూట్లు తొడిగించుకుంటున్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు  

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

సాక్షి, విజయవాడ: బీసీలను ఉద్ధరిస్తామని, కార్యకర్తలే తమ బలమని ప్రగల్భాలు పలికే టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మాటల్లో మినహా.. చేతల్లో బీసీలన్నా, కార్యకర్తలన్నా వారికి చులకనే. ఇటీవల బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగిన ఓ ఘటన కార్యకర్తలను ఔరా! అనిపించింది.

టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ‘ప్రతి ఇంటికి తెలుగుదేశం’ పేరుతో ఈ నెల 19న మల్లవల్లిలో పర్యటించారు. ఓ కార్యకర్తతో తన షూస్‌ తొడిగించుకున్న ఘటన అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ నాయకులు ఈ రకంగా వ్యవహరించటం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు చర్చించుకున్నారు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వైరల్‌గా మారింది.

చదవండి: (రాజకీయ జీవితంపై గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు)

>
మరిన్ని వార్తలు