సారా కేసులో తెలుగు యువత నేత అరెస్ట్‌ 

23 Apr, 2022 09:07 IST|Sakshi
సయ్యద్‌ అబ్బాస్‌ (ఫైల్‌)   

కర్నూలు: సారా విక్రయిస్తూ తెలుగు యువత కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్‌ అబ్బాస్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో ఆయనపై 8 మట్కా నిర్వహణ కేసులు కూడా ఉన్నాయి. మట్కా డాన్‌ సయ్యద్‌ అసదుల్లా కుమారుడైన అబ్బాస్‌.. టీజీ భరత్‌కు అనుచరుడు. అబ్బాస్‌ సోదరులు సయ్యద్‌ నూరిపైన 10, అన్వర్‌పై 12 సారా, మట్కా కేసులున్నాయి.

తండ్రి అసదుల్లాపై 40కు పైగా మట్కా కేసులున్నాయి. గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంటి వద్ద సారా విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో   పోలీసులు ప్రత్యేక నిఘా వేసి అసదుల్లాతో పాటు అబ్బాస్, అన్వర్, సయ్యద్‌నూరిలను అరెస్ట్‌ చేశారు.  వారి నుంచి 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. వారిని  రిమాండ్‌కు పంపారు.

మరిన్ని వార్తలు