కొండచరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం

6 Dec, 2021 03:54 IST|Sakshi
ఘాట్‌రోడ్డును పరిశీలిస్తున్న కేరళ నిపుణులు

తిరుమల: భారీ వర్షాలకు ఘాట్‌ రోడ్డులో ఇటీవల విరిగిపడిన కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత వర్సిటీ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టీటీడీ ఆహ్వానించింది.

ల్యాండ్‌స్లైడ్స్‌ నిపుణులు కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించుకుని సమగ్ర సర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు. అమృత వర్సిటీ స్ట్రాటజిక్‌ ఇన్షియేటివ్స్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్‌ మనీషా, ప్రొఫెసర్‌ నిర్మల వాసుదేవన్, ప్రొఫెసర్‌ సుదేష్‌ విద్వాన్, టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి, ఈఈ సురేంద్రనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు