ఎట్టకేలకు బోనులో చిక్కింది.. ఆపరేషన్‌ చిరుత సక్సెస్‌.. ఇకపై నడకదారిలో భక్తులు ప్రశాతంగా..

28 Aug, 2023 11:11 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో ఆపరేషన్‌ చిరుత విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కింది. దీంతో ఇకపై నడకదారి మార్గంలో భక్తులు ప్రశాంతంగా సంచరించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 


నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్‌ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో చిరుత.. బోను దాకా వచ్చిపడకుండా పోతోంది అది. అలా వారం గడిచింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిక్కింది. 

ఈ చిరుత పట్టివేతతో.. ఆపరేషన్‌ చిరుత ముగిసినట్లేనని అధికారులు అంటున్నారు. చిరుతల పట్టివేత పూర్తి కావడంతో.. ఇకపై భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించే అవకాశం ఉందని అంటున్నారు.

టీటీడీ అప్రమత్తత
చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. విజయవంతమయ్యారు.

మరో 500 ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు
చిరుత చిక్కిన ప్రదేశాన్ని సీసీఎఫ్‌వో నాగేశ్వరరావు పరిశీలించారు.  ‘‘చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించాం. ఇది మగ చిరుత. రెండేళ్ల వయసుంది. నడక మార్గంలో ట్రాప్‌ కెమెరాలు నిరంతరం ఉంటాయి. నడకమార్గంలో ప్రస్తుతం 300 కెమెరాలు ఉన్నాయి. మరో 500 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. 

మరిన్ని వార్తలు