విజయవాడ నగరవాసులకు అలర్ట్‌, రేపు రూట్‌లలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మళ్లింపులు

7 Aug, 2023 20:54 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌: విజయవాడ నగరంలో రేపు(08-08-2023) మంగళవారం ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం ప్రకటించింది. సామాన్య ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఉదయం 05. గంటల నుండి సాయంత్రం 06.గంటలు ఈ క్రింది ట్రాఫిక్ రూట్‌లలో మళ్ళింపులు, ఆంక్షలు అమలులో అమలు కానున్నాయి. 

ఆంక్షలు
🚧 చుట్టుగుంట నుండి రామవరప్పాడు వైపుకు పడవలరేవు మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించబడవు.
🚧  మధురా నగర్ జంక్షన్ నుండి రామవరప్పాడు వైపుకు పడవలరేవు మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించబడవు.
🚧  రామవరప్పాడు నుండి పడవలరేవు(ఏలూరు రోడ్) వైపు ఎలాంటి వాహనములు అనుమతించబడవు.
🚧   గుణదల పోస్ట్ ఆఫీస్ జంక్షన్ నుండి ESI కటింగ్(ఏలూరు రోడ్) వైపు ఎలాంటి వాహనములు అనుమతించబడవు.
 

డైవర్షన్‌లు
🚧   చుట్టుగుంట నుండి రామవరప్పాడు వెళ్ళవలసిన వాహన దారులు చుట్టూ గుంట జంక్షన్ నుండి నైస్ బార్ జంక్షన్ – మధు చౌక్ – జమ్మి చెట్టు సెంటర్ – సిద్దార్ధ జంక్షన్ – అమ్మ కళ్యాణ మండపం జంక్షన్ వద్ద  కుడి వైపుకు -రమేష్  హాస్పిటల్ జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.
🚧  రామవరప్పాడు నుండి ఏలూరు రోడ్ మరియు BRTS రోడ్ కు వెళ్ళవలసిన వాహన దారులు రామవరప్పాడు నుండి మహానాడు జంక్షన్ – రమేష్ హస్పిటల్ జంక్షన్ వద్ద కుడి వైపుకు – అమ్మ కళ్యాణ మండపం వద్ద ఎడమ వైపుకు – సిద్దార్ధ కాలేజీ జంక్షన్ – జమ్మి చెట్టు సెంటర్ – మధు చౌక్ – నైస్ బార్ జంక్షన్ – పుష్ప హోటల్ జంక్షన్ – దీప్తి జంక్షన్ మీదుగా వెళ్ళవలెను. 
🚧  ESI కటింగ్ (ఏలూరు రోడ్ ) నుండి రామవరప్పాడు కు విద్యుత్ సౌద మీదుగా ఎలాంటి వాహనములు కానీ పాద చారులు కానీ అనుమతి లేదు.

కనుక వాహన దారులు ప్రజలు సహకరించాలని.. ట్రాఫిక్  ఆంక్షలు, మళ్లింపులను అనుసరించి తమ తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు యత్నించాలని సీపీ సదరు ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు