మనసుతో పాలించిన మహానేత వైఎస్సార్‌ 

3 Sep, 2023 05:32 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు 

పలు చోట్ల అన్నదాన, వస్త్రదాన తదితర సేవా కార్యక్రమాలు 

పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు

 సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌:  రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. అందించిన మానవీయ, సుపరిపాలనను స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం, అన్నదానం, వస్త్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టారు.   పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం అ­హ­ర్ని­శలు కృషి చేశారంటూ వైఎస్సార్‌ను గుర్తుచేసుకున్నారు.  

అభిమాన నేతను తలచుకొంటూ..  
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మహానేత విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వాడవాడలా ప్రజలు తమ అభిమాన నేత విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అల్లవరం మండలం కోడూరుపాడులో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కాకినాడలో ఎంపీ వంగా గీత, కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌  వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  

వాడవాడలా సేవా కార్యక్రమాలు 
ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాడవాడలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పోరంకిలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ వల్లభనేని బాలÔౌరి పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌తో పాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో అశువులు బాసిన ఆయన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ జాన్‌ వెస్లీ విగ్రహానికి కూడా ప్రజలు పూల మాలలు వేశారు.

పల్నాడులో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేమూరులో మంత్రి మేరుగు నాగార్జున, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వైఎస్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 

మహానేతకు ఘన నివాళి  
ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్‌ వర్థంతి కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేశారు. రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి క్యాంప్‌ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తి, కుప్పం బస్టాండు వద్ద ఎంపీ రెడ్డప్ప, నంద్యాలలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, దేవనకొండలో మంత్రి గుమ్మనూరు జయరాం, బ్రహ్మసముద్రంలో మంత్రి ఉషశ్రీ చరణ్, అనంతపురంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌  వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ కా­ర్యా­లయం నుంచి వైఎస్సార్‌ స్మృతి వనం వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు.  విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం కార్యాలయంలో మహానేత  వైఎస్సార్‌కు నివాళులర్పించారు. 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
సంక్షేమ పాలనతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. తన తండ్రి బాటలోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సంక్షేమ పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌ కూడా తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. మనసున్న వ్యక్తి పాలకుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారనేదానికి వైఎస్సార్‌ పాలనా కాలమే నిదర్శనమన్నారు. శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

సజ్జలతోపాటు మంత్రులు, పలువురు పార్టీ నేతలు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ బాటలోనే సీఎం  జగన్‌ కూడా మడమ తిప్పకుండా పరిపాలిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ ఇప్పటికీ ప్రజల మనసుల్లో జీవించి ఉన్నారని కొనియాడారు.  మంత్రులు మేరుగు నాగా­ర్జున, జోగి రమేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  జూపూడి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు