టీటీడీ కీలక నిర్ణయం.. కచ్చితంగా ఆ రూల్స్‌ పాటించాల్సిందే..

31 May, 2022 19:47 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో రేపటి(బుధవారం) నుంచి పూర్తిగా ప్లాస్టిక్‌ నిషేధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దుకాణదారులు, హోటళ్లు, ప్లాస్టిక్‌ కవర్స్‌ వాడితే సీజ్‌ చేస్తామని టీటీడీ అధికారులు హెచ్చరించారు. షాంపులను కూడా తిరుమలలో టీటీడీ నిషేధం విధించింది. దుకాణదారులు ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించింది. ప్లాస్టిక్‌ రహిత వస్తువులనే అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.
చదవండి: నోరూరించే పనస పండ్లు.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?

మరిన్ని వార్తలు