మీ చర్యలు బాగున్నాయ్‌.. కలెక్టర్‌కు కేంద్రం ప్రశంసలు

4 Aug, 2020 06:39 IST|Sakshi

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో వసతులపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంస  

సాక్షి, అనంతపురం అర్బన్‌: కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోని వ్యక్తుల్లో మానసింకంగా ఉల్లాసం నింపేందుకు కలెక్టర్‌ తీసుకున్న చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ద్వారా ప్రశంసలు కురిపించింది. కేర్‌ సెంటర్లలోని పేషంట్లు కాలక్షేపం లేకపోవడంతో ఒంటరితనం భావనలో ఉండడాన్ని కలెక్టర్‌ గమనించారు. శారీరక, మానసిక ఉల్లాసం కల్పించడం ద్వారా వారిలోని ఒంటరి భావన తొలగించవచ్చని ఆలోచన చేశారు.

అందులో భాగంగా కేర్‌సెంటర్లలో టెన్సిస్, షెటిల్, వాలీబాల్, క్యారమ్స్‌ వంటి ఆటలు, సంగీతం కోసం మ్యుజిక్‌ సిస్టం ఏర్పాటు చేయించారు. ఉదయం, సాయంత్రం వేళ ఎవరికి నచ్చిన... వచ్చిన ఆటలను  అంతే కాకుండా కేర్‌ సెంటర్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయించారు. వారు కోవిడ్‌ పేషంట్లకు కౌన్సిలింగ్‌ ఇస్తూ ఆత్మస్థైర్యం నింపుతారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో పేషంట్ల ఉల్లాసం కోసం  విడుదల చేసిన డాక్యుమెంటరీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్‌ దారా స్పందించింది. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మానసిక, శారీరక ఉల్లాసం కోసం తీసుకున్న చర్యల వల్ల పేషంట్లు ఉత్సాహంగా ఉంటూ త్వరగా రికవరీ అవుతారని పేర్కొంది.   (రియల్‌ హీరోస్‌..)

మరిన్ని వార్తలు