ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో నవ్వులు పూయించిన తాత.. వీడియో వైరల్..

23 Jan, 2023 08:46 IST|Sakshi

ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ సర్వసాధారణమైపోయింది. వధూవరులు అందమైన లోకేషన్లకు వెళ్లి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లను పెట్టుకుని ఫొటోలు దిగుతున్నారు. దీని కోసం వేల రుపాయలు, అవసరమైతే లక్షలు కూడా ఖర్చు చేస్తున్నారు.  ఉత్తరాంద్రలో కూడా ఓ జంట ఇలాగే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌కు వెళ్లింది. కాస్త ఢిపరెంట్‌గా ఆలోచింది నాటు పడవలో ఓ నదిలో ఫొటోలు దిగాలనుకుంది. అయితే ఇక్కడే వాళ్లకు వింత అనుభవం ఎదురైంది. నాటు పడవ నడిపిన ఓ తాత టాలెంట్ చూసి ఈ జంట అవాక్కైంది. 

అమ్మాయి అబ్బాయి ఫొటో ఎలా దిగాలి, ఏ ఫోజు ఇవ్వాలో కూడా తాత చెప్పేస్తున్నాడు. చేతి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు,  అమ్మాయిని ఇలా పట్టుకో, ఇద్దరూ అటు చూసి ఫోజు ఇవ్వండి అంటూ డైరెక్షన్లు ఇచ్చేస్తున్నాడు. ఉత్తరాంద్ర యాసలో మాట్లాడుతూ తాత ఫోజులు చెప్పడం చూస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. పడవ నడిపే తాతే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‍లా కన్పిస్తున్నాడని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈయన టాలెంట్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

భలే భలే ఓ అమ్మాయీ - పాత రోజులు మారాయీ
ఆడపిల్లా తిరిగినచో - పట్టుకొనునూ అబ్బాయీ

భలే భలే ఓ అబ్బాయీ - ఈ ఒక్క రోజే నీది పైచేయీ
ఆ పిల్ల వేలెత్తినచో - నీకు మూడెను తెలుసుకోవోయీ

భలే భలే ఓ అమ్మాయీ - ఈ ఒక్క రోజు నే చెప్పినట్టు చేయీ
వాడి మీదకు కాలెత్తాలీ - లేకపోతే వాడికి భయముండదమ్మాయీ

వాడిదేముంది వెధవాయి
పట్టుకుంటాడులే బడుద్దాయి

— రామ్ కేసరి, అమెరికా (ఆరుద్ర గారికి సన్నాయి)

మరిన్ని వార్తలు