గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం

16 Dec, 2023 05:15 IST|Sakshi

గృహ నిర్మాణాల దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అడుగులు 

నిర్వాసితుల కోసం రూ. 80.48 కోట్లు మంజూరు 

ఫలించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కృషి 

గతంలో వారిని గాలికొదిలేసిన టీడీపీ ప్రభుత్వం

గన్నవరం: ఎంతో కాలంగా కన్నులు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం కానుంది. వి­మా­నాశ్రయ విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయి­న నిర్వాసితులకు ఇచ్చిన హామీలను గత టీడీపీ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేయ­గా.. ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ వారికి బాస­టగా నిలుస్తోంది.

కనీసం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో కూడా నిర్దిష్టమైన విధి వి­ధా­నాలను రూపొందించలేదు. దీంతో చిక్కు­ము­డి­గా మారిన నిర్వాసితుల సమస్యలను ఒక్కొ­క్కటిగా పరిష్కరించుకుంటూ గృహ నిర్మాణాలను సాకారం చేసే దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.  నిర్వాసిసితుల పక్షా­న నిలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వారి సమస్యల పరిష్కారానికి, నిధు­లు మంజూరుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 

హామీలు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం..  
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) విస్త­రణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. విస్తరణలో దావాజీగూడెం, అల్లాపురం, బుద్ధవరంలో ఇళ్లు, స్థలాలు పోతున్న 423 కుటుంబా­ల­­కు గృహాలు నిర్మించేందుకు 2015లో టీడీపీ ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ తీసుకొచి్చంది. ఈ ప్యాకేజీలో భాగంగా గృహ నిర్మాణాలకు చిన్నఆవుటపల్లి పరిధిలో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వా­రా సుమారు 52 ఎకరాల భూమి సేకరించారు. ఆ భూమిలో కొద్దిమేర మెరక చేసి.. మౌలిక సదుపాయల కల్పనను అప్పటి ప్రభుత్వం గాలికి వదిలేసింది. కనీసం నిర్వాసితులకు ప్లాట్లు కూడా కేటాయించకుండా చేతులు దులుపుకుంది.

అనంతరం 2019లో అధికారంలోకి వ­చ్చి­న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించింది. రెండుసార్లు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి లాట­రీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది.  ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే వంశీమోహన్‌ నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నిర్వాసితుల గృహ నిర్మా­ణాలకు రెండు దఫాలుగా రూ. 4.50 లక్షలు చొప్పన ఒక్కొక్కరికీ రూ.9 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిర్వాసితులు చెల్లించాల్సిన రూ.3.76 కోట్ల స్టాంప్‌ డ్యూటీకి మినహాయింపు కల్పించి ఉచి­తంగా ప్లాట్ల రిజి్రస్టేషన్‌ చేసి దస్తావేజులను అందజేశారు.

సమస్యల పరిష్కారానికి రూ. 80.48 కోట్లు మంజూరు.. 
విమానాశ్రయ నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.80.48 కోట్లు ఖర్చు చేయనుంది. వీటిలో ఎయిర్‌పోర్ట్‌ అవుట్‌ డ్రెయిన్‌ కోసం ఇళ్లు తొలగించిన 47 కుటుంబాలకు అద్దె బకాయిలు రూ.­1.21 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌ స్థలంలో మౌలి­క సదుపాయాలకు రూ.41.20 కోట్లు, గృహ నిర్మాణాలకు రూ. 38.06 కోట్లు వ్యయం చేయనుంది. ఇప్పటికే అద్దె బకాయిలు, నిర్వాసితులకు మొదటి విడతగా గృహ నిర్మాణాలకు చెల్లించేందుకు రూ. 17.35 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ నిధులను కాంపిటెంట్‌ అథారిటీ, గుడివాడ రెవెన్యూ డివిజన్‌ అధికారి ద్వారా నిర్వాసితుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా జమ చేయనున్నారు. ఇంకా గృహ నిర్మాణాలకు రెండో విడత నిధులు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ స్థలంలో లెవలింగ్, రోడ్లు, డ్రైయిన్లు, తాగునీరు, విద్యుత్‌ సదుపాయాల కోసం మిగిలిన రూ. 63.12 కోట్లు కూడా కేటాయిస్తూ ప్రభు­త్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు