నాన్నా.. మీ ఆశయాలే నన్ను చెయ్యిపట్టి నడిపిస్తున్నాయ్‌: సీఎం జగన్‌

2 Sep, 2023 10:27 IST|Sakshi

సాక్షి, గుంటూరు: దివంగత మహానేత వైస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ‘‘నాన్నా... మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది’’ అంటూ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారాయన. 

భౌతికంగా మా మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారాయన. 

ఇక వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్‌ అభిమానగణం తరలివెళ్తోంది. సీఎం జగన్‌ కూడా వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. 

మరిన్ని వార్తలు