YSR Pension Kanuka: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక.. అవ్వా తాతలకు పండగ

1 Oct, 2022 09:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం 62.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. ఉదయం 8 గంటల వరకు 31.84 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్‌ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.
చదవండి: ప్లీజ్‌.. తమ్ముళ్లూ ప్లీజ్‌.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు  

సూర్యోదయానికి ముందే..
ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో  వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా అయిదో తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వీళ్లు ఎవ్వరూ ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి ₹1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది. గత ఏడేళ్లలో ప్రతి సెప్టెంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం వివరాలివి...

సంవత్సరం          పంపిణీ చేసిన మొత్తం
సెప్టెంబర్ 2022      ₹1,590.50 కోట్లు 
సెప్టెంబర్ 2021      ₹1,397 కోట్లు
సెప్టెంబర్ 2020      ₹1,429 కోట్లు
సెప్టెంబర్ 2019      ₹1,235 కోట్లు
సెప్టెంబర్ 2018      ₹477 కోట్లు
సెప్టెంబర్ 2017      ₹418 కోట్లు
సెప్టెంబర్ 2016      ₹396 కోట్లు
సెప్టెంబర్ 2015      ₹405 కోట్లు

మరిన్ని వార్తలు