ప్రభుత్వ వ్యవస్థలను టీడీపీ సర్వనాశనం చేసింది..

21 Nov, 2020 18:46 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, తాడేపల్లి: మత్స్యకారులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రూ.225 కోట్లతో ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అన్నివర్గాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సీఎం భావిస్తున్నారని ఆయన చెప్పారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ప్రజా బలంతో నిలబడిన నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. (చదవండి: ‘అచ్చోసిన’ ఆరు అబద్ధాలు)

‘‘ప్రాంతీయ అసమానతలతో విభజనను ప్రోత్సహించిన గత పాలకులను చూశాం. ప్రాంతీయ అసమానతలను తొలగించేలా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ సంకల్పించారు. ఏడాదిన్నర కాలంలో ప్రజలు అద్భుతమైన పాలన చూశారని’’ ఆయన పేర్కొన్నారు. ‘‘సీఎం జగన్‌ 14 మాసాలు.. 3,648 కిలోమీటర్ల తన పాదయాత్ర లో ప్రతి గుండె చప్పుడు విన్నారు. వారి కష్టాలు గుండెల్లో పెట్టుకునే పాలన మొదలు పెట్టారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అస్తవ్యస్త నిర్ణయాలతో పాలన సాగించారు. దీంతో ప్రజలు టీడీపీని మట్టి కరిపించారు. అమరావతిలోనే టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారు. ఆయన వారసుడి సైతం ఇంటికి పంపారు. అధికారం పోయేసరికి చంద్రబాబు మాయల ఫకీరు  వేషాలు వేస్తున్నారు. అనేక కుట్రలు చేస్తున్నారు. (చదవండి: ‘హైదరాబాద్‌ జూమ్‌ టీవీలో ప్రతిపక్షం’)

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేలా వైఎస్‌ జగన్‌ పాలన అందిస్తున్నారు. చంద్రబాబు అనుకూల పత్రికలు, వర్గాలు.. దానిని జీర్ణించుకోలేక పోతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు, పాఠశాలల కోసం ప్రభుత్వ వ్యవస్థలను టీడీపీ సర్వనాశనం చేసింది. రాష్ట్రంలో 32 లక్షల పేదలకు ఇళ్లు లేవంటే గత పాలకులు సిగ్గు పడాలి...? చంద్రబాబు ఎన్ని కిరికిరీలు చేసినా పేదలకు వైఎస్‌ జగన్‌ ఇళ్లు ఇచ్చి తీరతారు.  చంద్రబాబు జన్మ భూమి కమిటీలతో గ్రామాల్లో  భ్రష్టు పట్టించారు. వైద్యం పై నిర్లక్ష్యం వహించి 104,108లు సైతం నడపలేకపోయారు. వైద్యానికి సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారు. గత టీడీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైఎస్‌ జగన్‌.. రైతు భరోసా కేంద్రాలతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు