ఏపీఎండీసీ నిధులతో అభివృద్ధి పనులు

22 Mar, 2023 02:06 IST|Sakshi

ఓబులవారిపల్లె: ఏపీఎండీసీ నిధులతో కొర్లకుంట గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ప్రభుత్వవిప్‌ కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, సీనియర్‌ నాయకులు కొల్లం గంగిరెడ్డి, ఏపీటీడీసీ డైరెక్టర్‌ వత్తలూరు సాయికిషోర్‌ రెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్‌ షమీమ్‌ అస్లాంలు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎండీసీ ఎండీ వీజీ వెంకటరెడ్డి మాట్లాడుతూ మంగంపేట గనులకు సమీపంలోని కొర్లకుంట గ్రామంలో శ్రీ అంకాలమ్మ పరమేశ్వరీ దేవాలయానికి దాదాపు రూ. 34 లక్షలు నిధులతో ప్రహరీ, అభివృద్ధి పనులు చేయించామన్నారు. అదే విధంగా గ్రామంలో రూ. 40 లక్షలతో పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్‌ తదితరులు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కొర్లకుంటలోని ఎండీ వీజీ వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంకాలమ్మ పరమేశ్వరీ ఆలయం వద్ద ఏపీటీడీసీ డైరెక్టర్‌ వత్తలూరు సాయికిషోర్‌ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పంజం సుకుమార్‌ రెడ్డి, సీపీఓ వెంకటరమణ, సీనియర్‌ నాయకులు ముక్కా మధుసూదన్‌ రెడ్డి, ఓజీ శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీపీ తమ్మెద తిరుపాల్‌, స్థానిక సర్పంచ్‌ సావిత్రమ్మ, ఎంపీటీసీ వత్తలూరు రోహిణీ కుమార్‌ రెడ్డి, సర్పంచ్‌లు జరుగు నారాయణ రెడ్డి, పోలి పాపిరెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్‌ అమరేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

వార్షికోత్సవ కార్యక్రమంలో..

మంగంపేట, ఏపీఎండీసీ పాఠశాల 6వ వార్షికోత్సవానికి ఎంపీ మిథున్‌ రెడ్డి, ప్రభుత్వవిప్‌ కొరముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ఏపీఎండీసీ పాఠశాలలో కూడా 8, 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందిస్తామన్నారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. అదనంగా నూతన బస్సు, తరగతి గదులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వవిప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఏపీఎండీసీ ఎండీ వీజి వెంకటరెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్‌ షమీమ్‌ అస్లాం మాట్లాడారు. అంతకుముందు మంగంపేట జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు గుత్తిరెడ్డి హరినాథ్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ కౌలూరు మధుసూదన్‌ రెడ్డిలు నాయకులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాజంపేట సబ్‌ కలెక్టర్‌ పర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఏపీఎండీసీ పాఠశాల చైర్మన్‌ ఆనందరెడ్డి, ఏఓ రేవతి, సీనియర్‌ నాయకులు తల్లెం రమణారెడ్డి, స్థానిక సర్పంచ్‌ మినుగు సుధాకర్‌, ఎంపీటీసీ హరిబాబు, గుంతకల్‌ రైల్వేబోర్డు సభ్యులు తల్లెం భరత్‌ కుమార్‌ రెడ్డి, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ వడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభించిన ఎంపీ మిథున్‌రెడ్డి,

ఎమ్మెల్యే కొరముట్ల

మరిన్ని వార్తలు