గ్రహం అనుగ్రహం (18-08-2020)

18 Aug, 2020 05:41 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి బ.చతుర్దశి ఉ.9.43 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం ఆశ్లేష తె.5.01 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి మఖవర్జ్యం సా.6.04 నుంచి 7.38 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు, తదుపరి రా.10.54 నుంచి 11.41 వరకు, అమృతఘడియలు... రా.3.24 నుంచి 5.02 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

గ్రహఫలం
మేషం....వ్యయప్రయాసలతో పనులు పూర్తి. ప్రయాణాలు వాయిదా. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం...కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.

మిథునం...వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం...పనుల్లో పురోగతి. బంధువులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత. కొత్త వస్తువులు సేకరిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం...వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. పనులు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

కన్య....కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల...మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం...అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనుల్లో ప్రతిష్ఠంభన. నిర్ణయాలు మార్చుకుంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు...కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మకరం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కుంభం...ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పనుల్లో విజయం. వాహనయోగం. నూతన పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మీనం....పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువుల నుంచి పిలుపు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

>
మరిన్ని వార్తలు