గ్రహం అనుగ్రహం (22-10-2020)

22 Oct, 2020 06:44 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.షష్ఠి ప.1.14 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం మూల ఉ.7.20 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.5.48 నుంచి 7.20 వరకు, తిరిగి సా.4.43 నుంచి 6.14 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.34 వరకు, తదుపరి ప.2.25 నుంచి 3.13 వరకు, అమృతఘడియలు... రా.2.02 నుంచి 3.33 వరకు.

సూర్యోదయం :    5.58
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

రాశిఫలం
మేషం:
మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. 

వృషభం: కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి ఉత్సాహంగా సాగుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం. స్నేహితుల నుంచి  శుభవార్తలు. విద్యార్థులకు నూతనోత్సాహం. గృహయోగం. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. 

కర్కాటకం:  నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని  సమస్యల నుంచి విముక్తి.  ఆలోచనలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. 

సింహం: మిత్రులు, బంధువుల నుంచి విభేదాలు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. భూవివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరుత్సాహం. అనారోగ్యం. 

కన్య: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.  ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. 

తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా  సాగుతాయి.

వృశ్చికం: కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు మందగిస్తాయి.  వృత్తి, వ్యాపారాలలో చికాకులు. 

ధనుస్సు: వ్యవహారాలలో అంచనాలు నిజం కాగలవు. శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమ కొలిక్కి వస్తుంది. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం: ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. అనారోగ్యం. బంధువులు, ఆప్తులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. 

కుంభం: కొన్ని బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు.

మీనం: ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యల నుంచి బయటపడతారు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు