ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి

30 Jun, 2021 06:20 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.షష్ఠి సా.4.53 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం పూర్వాభాద్ర పూర్తి (24 గంటలు) వర్జ్యం ప.11.41 నుండి 1.19 వరకు దుర్ముహూర్తం ప.11.35 నుండి 12.28 వరకు అమృతఘడియలు... రా.9.32 నుంచి 11.03 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు: 

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.  ధనలబ్ధి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.

మిథునం: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.

కర్కాటకం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు.  వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో  ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పనులు చకచకా సాగుతాయి..

తుల: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. 

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

ధనుస్సు: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.  కుటుంబసమస్యలు తీరతాయి.

మకరం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు.  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

మీనం: అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.
 

మరిన్ని వార్తలు