ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి, వస్తులాభం

2 Apr, 2023 06:50 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ  సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.ద్వాదశి పూర్తి (24గంటలు), నక్షత్రం: మఖ పూర్తి (24గంటలు), వర్జ్యం: సా.5.55 నుండి 7.41 వరకు, దుర్ముహూర్తం: సా.4.32 నుండి 5.21 వరకు, అమృతఘడియలు: తె.4.32 నుండి 6.20 వరకు (తెల్లవారితే సోమవారం).

సూర్యోదయం        :  5.58
సూర్యాస్తమయం    :  6.09
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిదానిస్తాయి.

వృషభం: సన్నిహితులు, శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: కుటుంబంలో సమస్యలు తప్పవు. కొన్ని బాధ్యతలు సవాలుగా మారవచ్చు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. 

కర్కాటకం: దూరపు బంధువుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల: పరపతి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: శ్రమ మరింత తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సు: కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. భూలాభాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకం.

కుంభం: ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. పనుల్లో విజయం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మరిన్ని వార్తలు