Today Astrology - ఈ రాశివారు నిర్ణయాలు మార్చుకుంటారు, మీదే పైచేయి

6 Jun, 2023 06:54 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.విదియ ఉ.5.43 వరకు, తదుపరి తదియ రా.3.38 వరకు, నక్షత్రం: పూర్వాషాఢ రా.2.12 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.12.34 నుండి 2.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.59 వరకు, తిరిగి రా.10.54 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: రా.9.32 నుండి 11.02 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేయాల్సివస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.  అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అవరోధాలు తీరతాయి.

సింహం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

తుల: ముఖ్యమైన పనుల్లో విజయం. కోర్టు వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో ముందడుగు. ఆకస్మిక ధనలబ్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కార్యజయం. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.
 

మరిన్ని వార్తలు