ఈ రాశివారు విందు, వినోదాల్లో పాల్గొంటారు

1 May, 2022 06:39 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం తిథి శు.పాడ్యమి రా.2.07 వరకు, తదుపరి విదియ, నక్షత్రం భరణి రా.9.17 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం ఉ.5.57 నుండి 7.41 వరకు, దుర్ముహూర్తం సా.4.33 నుండి 5.24 వరకు, అమృతఘడియలు... సా.4.11 నుండి 5.56 వరకు. 

సూర్యోదయం        :  5.39
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశి ఫలాలు.. 

మేషం: పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కర్కాటకం: ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

సింహం: మిత్రులతో కలహాలు. రుణబాధలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్రమైన సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృశ్చికం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఉత్సాహం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.

ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. సోదరులతో కలహాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కుంభం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

మీనం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

మరిన్ని వార్తలు