Today Horoscope: ఈ రాశివారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు.. మిత్రుల నుంచి శుభవార్తలు

1 Dec, 2022 06:41 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: శు.అష్టమి ఉ.11.34 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: శతభిషం ఉ.10.50 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: సా.4.56 నుండి 6.27 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.43 వరకు, తదుపరి ప.2.22 నుండి 3.06 వరకు, అమృత ఘడియలు: రా.2.08 నుండి 3.34 వరకు.

సూర్యోదయం :    6.17
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం: పోటీపరీక్షల్లో విజయం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యభంగం. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

సింహం: ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కన్య: రుణ విముక్తి పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. సన్మానాలు పొందుతారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

తుల: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

వృశ్చికం: పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

ధనుస్సు: మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు చేపడతారు. ప్రముఖులు పరిచయం. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మీనం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మరిన్ని వార్తలు