ఈ రాశి వారికి ధనలాభం

3 May, 2022 06:16 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.తదియ తె.5.11 వరకు(తెల్లవారితే బుధవారం) తదుపరి చవితి, నక్షత్రం రోహిణి రా.1.23 వరకు, తదుపరి మృగశిర వర్జ్యం సా.4.39 నుండి 6.24 వరకు, దుర్ముహూర్తం ఉ.8.07 నుండి 8.58 వరకు, తదుపరి రా.10.47 నుండి 11.34 వరకు అమృతఘడియలు... రా.9.53 నుండి 11.35 వరకు. అక్షయతృతీయ. 

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

రాశి ఫలాలు..
మేషం: రుణయత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

వృషభం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది.ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మిథునం: వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పోటీపరీక్షల్లో విజయం. విందువినోదాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు. సోదరులతో మాటపట్టింపులు.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. బ«ంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగోన్నతి. దైవదర్శనాలు.

ధనుస్సు: కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. అత్యంత కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. విందువినోదాలు.

మకరం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. శ్రమా«ధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు బాధ్యతలు అధికం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు.

మీనం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.

మరిన్ని వార్తలు