దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగు.. ఆస్తి లాభం, మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

12 Jan, 2023 06:40 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం,
సూర్యోదయం 6.38; సూర్యాస్తమయం 5.39. 

తిథి: బ.పంచమి ప.1.01 వరకు, తదుపరి షష్ఠి,
నక్షత్రం: పుబ్బ ఉ.11.35 వరకు, తదుపరి ఉత్తర,

వర్జ్యం: రా.7.15 నుండి 8.55 వరకు,
దుర్ముహూర్తం: ఉ.10.17 నుండి 11.03 వరకు, తదుపరి ప.2.43 నుండి 3.25 వరకు,

అమృతఘడియలు: తె.5.26 నుండి ఉ.7.08 వరకు (తెల్లవారితే శుక్రవారం);  
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు;

మేషం: పనులు మధ్యలో నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. విచిత్రమైన సంఘటనలు. బంధువుల కలయిక. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పండితగోష్ఠులలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు ఒత్తిడులు.వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: బంధువుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య: ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు. పనుల్లో ఆటంకాలు. రాబడికి మించి ఖర్చులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

తుల: యత్నకార్యసిద్ధి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు.  వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదోన్నతులు.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబంలో చికాకులు. పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ప్రోత్సాహం. బంధువుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

మరిన్ని వార్తలు