ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు.. ఆస్తి వివాదాలు

15 Dec, 2022 06:42 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.సప్తమి రా.9.06 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పుబ్బ లె .4.01 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.10.44 నుండి 12.28 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.04 నుండి 10.50 వరకు, తదుపరి ప.2.29 నుండి 3.11 వరకు, అమృతఘడియలు: రా.9.03 నుండి 11.29 వరకు;

రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు;
సూర్యోదయం 6.26;
సూర్యాస్తమయం 5.24. 

మేషం: బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత నిదానం అవసరం.

మిథునం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. దైవచింతన. వాహనయోగం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

కర్కాటకం: పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు భారంగా మారతాయి.

సింహం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కన్య: సన్నిహితులు,స్నేహితులతో వైరం. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. భూముల కొనుగోలు యత్నాలు సఫలం. విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం: యత్నకార్యసిద్ధి. ముఖ్యమైన పనులలో విజయం. ఆప్తుల సూచనలు పాటిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు: వివాదాలకు దూరంగా ఉండండి. పనుల్లో ప్రతిష్ఠంభన. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

కుంభం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు తీరతాయి. సోదరుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు