Today Horoscope: ఈ రాశి వారికి చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి

5 Apr, 2022 06:15 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.చవితి ప.2.34 వరకు, తదుపరి పంచమి నక్షత్రం కృత్తిక ప.3.55 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ఉ.8.21 నుండి 9.10 వరకు తదుపరి రా.10.53 నుండి 11.38 వరకు అమృతఘడియలు... ప.1.20 నుండి 3.02 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 


మేషం...పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో  ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపరుస్తాయి.

వృషభం...చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం చేసుకుంటారు.

మిథునం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

కర్కాటకం...కొన్ని సమస్యలు తీరే సమయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

సింహం...నూతన ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య....రుణయత్నాలు ముమ్మరం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి ముందుకు సాగండి.

తుల....వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృశ్చికం...కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు. ఉద్యోగప్రాప్తి. సంఘంలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ధనుస్సు.....చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం....మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి..

కుంభం...పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం....చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. రాబడి పెరుగుతుంది. పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మెరుగ్గా కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు