ఈ రాశివారికి మిత్రులతో మాటపట్టింపులు

7 Oct, 2021 06:19 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం తిథి శు.పాడ్యమి ప.3.26 వరకు, తదుపరి విదియ, నక్షత్రం చిత్త రా.12.04 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం ఉ.8.47 నుండి 10.21 వరకు తిరిగి తె.5.21 నుండి 6.54 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.9.49 నుండి 10.36 వరకు, తదుపరి ప.2.32 నుండి 3.20 వరకు, అమృతఘడియలు... సా.5.57 నుండి 7.29 వరకు, శరన్నవరాత్రులు ప్రారంభం.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.43
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు:

మేషం.. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు.

వృషభం.. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు. సోదరులు, మిత్రులతో అకారణంగా తగాదాలు.

మిథునం.. పనుల్లో తొందరపాటు. బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు.

కర్కాటకం.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం.. పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.

కన్య.. నూతన ఉద్యోగలాభం. పనుల్లో  విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

తుల.. శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో చిక్కులు.  ఉద్యోగాలలో నిరుత్సాహం. నిరుద్యోగుల యత్నాలు వాయిదా.

వృశ్చికం.. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు.. కార్యజయం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక.

మకరం.. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో సమస్యలు., ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. విద్యార్థులకు కొత్త సమస్యలు.

కుంభం.. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. ఆస్తుల వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి.

మీనం.. బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు