Today Horoscope: ఈ రాశివారికి ధనప్రాప్తి.. సంఘంలో గౌరవం

22 Apr, 2022 06:10 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.షష్ఠి ప.12.20 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం పూర్వాషాఢ రా.11.43 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం ఉ.10.19 నుండి 11.46 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.22 నుండి 1.14 వరకు అమృతఘడియలు... ఉ.10.21 నుండి 11.56 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం     :  6.19
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఇంటాబయటా నిరుత్సాహం. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.

వృషభం: మిత్రులతో అకారణవైరం. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఉద్యోగావకాశాలు చేజారవవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం: కొత్త పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: మిత్రులతో కలహాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. అనారోగ్య సూచనలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: రాబడికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. ప్రయాణాలలో అవాంతరాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు.

తుల: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల కలయిక. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.

వృశ్చికం: ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విరోధాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు క్లిష్టంగా మారతాయి.

ధనుస్సు: శుభవార్తలు వింటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులపై వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో
ఒడిదుడుకులు.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. నూతన విద్యావకాశాలు. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

మీనం: చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

మరిన్ని వార్తలు