Daily Horoscope: ఈ రాశి వారికి బంధువులతో తగాదాలు.. ఆర్థిక ఇబ్బందులు

23 Jan, 2022 06:09 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.పంచమి ఉ.7.11 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం ఉత్తర ఉ.9.34 వరకు తదుపరి హస్త, వర్జ్యం సా.5.50 నుండి 7.25 వరకు, దుర్ముహూర్తం సా.4.15 నుండి 5.00 వరకు, అమృతఘడియలు... సా.7.09 నుండి 8.36 వరకు.

సూర్యోదయం        :  6.38
సూర్యాస్తమయం    :  5.50
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు
 

మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తు, ధనలాభాలు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం: వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆదుర్దా చెందుతారు.

కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు.

తుల: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం: బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ధనలాభం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు: స్థిరాస్తిలాభం. మిత్రుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో సమస్యలు తీరతాయి. మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనుకోని ప్రయాణాలు. భూవివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: ఇంటాబయటా సమస్యలు. బంధువులతో విరోధాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: నూతన వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మరిన్ని వార్తలు