ఈ రాశి వారికి రుణబాధలు తొలగుతాయి

30 Nov, 2021 06:18 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.ఏకాదశి రా.9.47 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం హస్త సా.5.00 వరకు, తదుపరి చిత్త వర్జ్యం రా.12.43 నుండి 2.15 వరకు, దుర్ముహూర్తం ఉ.8.27 నుండి 9.13 వరకు, తిరిగి రా.10.31 నుండి 11.21 వరకు అమృతఘడియలు... ఉ.11.06 నుండి 12.41 వరకు.

సూర్యోదయం :    6.16
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

 మేషం....ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం...పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉండవచ్చు.

మిథునం...ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

కర్కాటకం...రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సకాలంలో పూర్తి చేస్తారు. 

సింహం...వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కన్య...శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు అధిగమిస్తారు.

తుల....సోదరులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం... సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు. సన్నిహితులతో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు....పరిచయాలు విస్తృతమవుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకరం...కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం...సోదరులు, మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మీనం...విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలు దక్కవచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యం సాధిస్తారు.
 

మరిన్ని వార్తలు